నవతెలంగాణ – మద్నూర్
2024 – జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సామాగ్రి జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్వహించుటకు మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల కు (నిన్న రాత్రి) చేరిందికామారెడ్డి జిల్లా కేంద్రం లోని వేర్ హౌస్ లో భద్రపరిచిన జుక్కల్ నియోజకవర్గ ఈవీఎం యంత్రాలను జుక్కల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో (పర్యవేక్షణలో) మద్నూర్ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలుర కు తీసుకువచ్చారు. రాజకీయ పార్టీల సమక్షంలో కంటైనర్ లో తీసుకువచ్చిన సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ లో ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కి సీల్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ముజీబ్, పిట్లం తాసిల్దార్ వేణుగోపాల్, నాయబ్ తాసిల్దార్ భరత్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్ధావర్ శంకర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బి ఆర్ ఎస్, బి ఎల్ పీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.