ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనలతో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్‌ ఉభసభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో బీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు ఆధ్వర్యంలో ఎంపీలు ఆందోళనకు దిగారు. ఉభయసభల్లో రిజర్వేన్ల బిల్లులు ప్రవేశపెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దేశంలో జనగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళ, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. కాగా, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరుగనున్న ఈ సవేశాల్లో కేంద్ర ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. తొలిరోజు 75 ఏండ్ల పార్లమెంటు ప్రస్థానంపై చర్చ జరుగనుంది.

Spread the love