యువత రాజీవ్ గాంధీ ఆన్లైన్ యూత్ క్విజ్ పోటీల్లో పాల్గొనండి

 – పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ – కంటేశ్వర్
యువత రాజు గాంధీ ఆన్లైన్ యూత్ క్విజ్ పోటీల్లో పాల్గొనాలని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ భవన్ నందు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హందాన్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పీసీసీ కార్యనిర్వాక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ ని నిస్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ రెండవ తేదీన రాజీవ్ గాంధీ ఆన్లైన్ యూత్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని, జూన్ ఒకటవ తేదీ వరకు 7661899899 మిస్ కాల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవలని ,జూన్ రెండవ తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, 16 నుండి 35 సంవత్సరాలు ఉన్న యువకులు ఈ పోటీలో పాల్గొనవచ్చని, క్విజ్ కాంపిటీషన్లో 60 ప్రశ్నలు గంట సమయం ఉంటుందని తెలియజేశారు. 7661899899 మిస్ కాల్ ఇస్తే మీ నంబరుకు ఒక ఆన్లైన్ లింక్ వస్తుంది దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని,రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే 8142903456,8142803456 కాల్ చేసి పరిష్కరించుకోవచ్చు అని ఆయన అన్నారు.ఈ పరీక్ష పోటీలో మహిళా టాపర్ కు ఈ-స్కూటర్ను బహుమతిగా అందజేస్తామని, అదేవిధంగా మొదటి బహుమతిగా లాప్టాప్, రెండవ బహుమతిగా స్మార్ట్ఫోన్, మూడవ బహుమతిగా ట్యాబ్లెట్, ఇవి కాకుండా 10 స్మార్ట్ వాచ్లు, 10 ఇయర్ పార్డులు, 10 హార్డ్ డ్రైవ్ లు, 10 పవర్ బ్యాంకులు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున తెలంగాణ రాష్ట్ర యువత ఈ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో పాల్గోనాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అవినీతి ప్రభుత్వంపై విజయం సాధించిందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయని, అక్కడ 40% పర్సెంట్ కమిషన్ ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు దించి వేశారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతిదానికి కమిషన్ తీసుకుంటున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనడానికి నిదర్శనం రాజస్థాన్లో 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, చత్తీస్గడ్ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని 2500 రూపాయలతో కొనుగోలు చేస్తున్నామని ,అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాటను అధికారంలోకి రాగానే నెరవేరుస్తుందని ఆయన అన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యాన్ని 2500 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 18 సంవత్సరాలు నిండి చదువుకునే ప్రతి అమ్మాయికి ఈ స్కూటర్లు అందజేస్తామని, అదేవిధంగా ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని, మహిళలకు 500 రూపాయలకే వంటగ్యాస్ అందిస్తామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ జూన్ రెండవ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో తెలంగాణ రాష్ట్రంలోని యువత అందరూ పాల్గొనాలని మహేష్ కుమార్ గౌడ్ యువకులకు కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, పిసిసి సెక్రెటరీ రాంభూపాల్ ,రామకృష్ణ పిసిసి డెలిగేట్ ఈసా ,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, ముష్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love