వివిధ గ్రామాల్లో పార్టీల ఇంటింటి ప్రచారం

నవ తెలంగాణ- రామారెడ్డి:
మండలంలో ఆయా గ్రామాల్లో గురువారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించాయి. ఆయా పార్టీల మేనిఫెస్టోను, గతంలో ఆయా పార్టీలు చేసిన అభివృద్ధి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. గోకుల్ చిన్న తండావాసులంతా ఎంపీపీ దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కు మద్దతు తెలిపారు. ఇసన్నపల్లిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love