నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట కు ప్యాసింజర్ రైలు నడుపాలని రైల్వె బోర్డు చైర్మన్ మరియు సిఇఓ జయ వర్మ సిన్హా ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. శుక్రవారం న్యూఢిల్లీలో భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ కు చెందిన రైల్వే బోర్డు చైర్మన్, సిఇఓ జయ వర్మ సిన్హా ను కలిసి సిద్దిపేట ప్రజల చిరకాల కోరిక, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రి హరీశ్ రావుల కృషి ఫలితంగా సిద్దిపేట వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తాయిందని, ప్రజాల రవాణా సౌకర్యార్తం ప్రజల రవాణా రైలును నడిపించాలని ఆమెను కోరినట్లు ఎంపీ తెలిపారు.