నవతెలంగాణ – హైదరాబాద్: రైలులో పర్సును దొంగతనానికి ప్రయత్నించిన ఓ దొంగను పట్టుకున్న ప్రయాణికులు అతనికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. దొంగవి రెండు చేతులు పట్టుకొని కొన్ని మీటర్ల దూరం వరకు కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. ఈ క్రమంలో రైలు ట్రాక్ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగను కిందకు దింపి పక్కకు తీసుకెళ్లారు. బిహార్‌లోని భాగల్‌పుర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని రైలులో ప్రయాణిస్తున్న కొందరు తమ ఫోన్లలో బంధించారు.