నవతెలంగాణ – ధర్మసాగర్
శ్రద్ధ ఆసక్తులే ప్రతి విజయానికి మూలమని క్రీడల ప్రత్యేక అధికారి ప్రశాంత్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా క్రీడ పోటీల కన్వీనర్ మండల పరిషత్ అభివృద్ది అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కప్పు 2024 మండల స్థాయిలో పోటీలను మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు,చదువుల పట్ల, ఆట పాటల పోటీల పట్ల శ్రద్ధ ఆసక్తులను చూపినప్పుడే విజయాలను అందుకుంటారని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఓటమి వెనుక లక్ష్యాలను సిద్ధించినట్లయితే గెలుపు తప్పక ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ సదానందం,సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై జాన్ పాషా, కళాశాల ప్రిన్సిపల్ ఆసనాల శ్రీనివాస్, ఎంపీఓ అఫ్జల్, వివిధ గ్రామాల కార్యదర్శులు, ధర్మసాగర్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సంబధిత పాఠశాలల పీడీలు,పీఈటీలు, విద్యార్థిని,విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.