పండుగకు పస్తులేనా! : సీఐటీయూ

నవ తెలంగాణ- మహబూబ్‌ నగర్‌
జిల్లాలో పనిచేస్తున్న ఐకెపీ వీవోఏలు పండుగ పూట కూడా పస్తులు ఉండాలా అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి అన్నారు.గురువారం తెలంగాణ ఐకెపి వీవో ఏ ఉద్యోగుల సంఘం జిల్లా సమావేశం కష్ణ అధ్యక్షతన సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఐకెపి వీవోఏలకు గత తొమ్మిది నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమ్మె చేసిన కాలానికి కూడా జీతాలు ఇవ్వాలని పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.నెల రోజుల క్రితమే బడ్జెట్‌ రిలీజ్‌ అయిన, నేటికీ జీతాలు విడుదల కాకపోవడము దుర్మార్గమన్నారు. పండగ పూట కూడా పస్తులుండాలనా అని ఆయన విమర్శించారు. అలాగే జిల్లాలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కూడా రెండు నుంచి ఐదు నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయన్నారు. పెద్ద ,చిన్న మధ్యతరహా, తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన అనేక పంచాయతీల్లో నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉండడం ప్రభుత్వ బాధారహిత్యానికి నిదర్శనం అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు లక్షల్లో జీతాలు చేసుకుంటూ మొదటి వారంలోనే జీతాలు తీసుకునే అధికారులు కిందిస్థాయి సిబ్బంది జీతాలు విడుదల చేయడంలో చిత్తశుద్ధి లేదని,ఏదో సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారని తెలిపారు. అది తక్కువ జీతాలతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ వీవోఏలు నెలలు తరబడి జీతాలు రాకపోవడంతో పండగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని .దసరా పండుగ లోపు జీతాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ వర్కర్ల ఏవో శంకర్‌ రావుకి వినతి పత్రం అందజేశారు. కాపీని వాట్సాప్‌ ద్వారా అడిషనల్‌ కలెక్టర్‌ యాదయ్య కు ఎంపీడీవో వెంకటేశ్వర్లు పంపించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో రమేష్‌ ,కష్ణ ఆబే ద, స్వప్న ,హరిత, బాలమణి ,అలివేల, రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love