నవతెలంగాణ – హైదరాబాద్; టీ20 WCలో సూపర్-8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు. వరుస బంతుల్లో(17.6, 19.1, 19.2) ముగ్గుర్ని ఔట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. 3 రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ ఆయన హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 WC చరిత్రలో రెండు హ్యాట్రిక్స్ తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించారు.