సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌గా

నవతెలంగాణ – హైదరాబాద్: మినీ వేలంలో భారీగా వెచ్చించి మరీ సొంతం చేసుకున్న ప్యాట్‌ కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రమోషన్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు కెప్టెన్‌గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. గత సీజన్‌లో జట్టును నడిపించిన ఐదెన్ మార్‌క్రమ్‌ను బాధ్యతల నుంచి తప్పించి కమిన్స్‌కు అప్పగించింది. మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ రూ. 20.5 కోట్లకు దక్కించుకుంది. కెప్టెన్‌గా ఆసీస్‌కు టీ20 వరల్డ్‌ కప్‌, వన్డే ప్రపంచ కప్‌ను అందించిన ఘనత కమిన్స్‌ సొంతం. దీంతో ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శనతో రాణించాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కమిన్స్‌ను సారథిగా నియమించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్‌ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్‌ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, సన్విర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్‌ ఫరూఖి, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్‌ మార్కండె, ట్రావిస్‌ హెడ్, వనిందు హసరంగ, జయ్‌దేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమన్యన్‌

Spread the love