రెండు వేల కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధి: పటేల్ రమేష్ రెడ్డి

– రూ.100 కోట్లతో సూర్యాపేటలో పర్యాటక అభివృద్ధి
– సీఎం కి జీవితాంతం రుణపడి ఉంటాను
– పదవి కార్యకర్తలకే అంకితం…తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
– జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం
నవతెలంగాణ – సూర్యాపేట
రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నుండి సూర్యాపేట కు వచ్చిన సందర్భంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మిత్రుడు సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్దవంతంగా నిర్వహిస్తూ  పర్యాటక రంగంలో రాష్ట్రన్నీ దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.అదేవిధంగా సూర్యాపేట ని పర్యాటకంగా రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.పట్టణంలోని సద్దుల చెర్వు వద్ద గల ట్యాంక్ బండ్ లో బోటింగ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్ తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాన్ని సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎటువంటి పదవులు లేనప్పటికీ సూర్యాపేట నియోజకవర్గం లో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటూ తాను నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేశానని ఆయన చెప్పారు.గత 30 ఏళ్లుగా సూర్యాపేట నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటున్నానని పేర్కొన్నారు.
వారితో కలిసి  నిజాయితీతో ఉన్నందుకే ఈ పదవి వచ్చిందని అందుకె ఈ పదవి కార్యకర్తలకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని సమయాల్లోనూ తన వెంట ఉండి మద్దతు పలికిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.ముప్పై ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు తాను చేసిన ప్రజాసేవకు గుర్తింపు గా సిఎం రేవంత్ రెడ్డి తనను రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లా కు  మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సూర్యాపేట అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తానని చెప్పారు. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ హామి ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో ఐదు గ్యారంటీ లను సిఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని, ఆగస్టు నెల 15 వ తేది నుండి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫి ని కూడ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.  సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ పదవి రావడానికి కృషి చేసిన సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.
పటేల్ రమేష్ రెడ్డికి ఘన స్వాగతం..
తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డి కి ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. అనంతరం పట్టణంలోని  మెడికల్ కాలేజ్, కోర్టు చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్, ఎంజి రోడ్ మీదుగా బైక్ ర్యాలీతో భారీ ఊరేగింపు నిర్వహించారు.అనంతరం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమేశ్ రెడ్డి సతీమణి పటేల్ లావణ్య,పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణా రెడ్డి, డా.వూర రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, దారవత్ వెంకన్న నాయక్,కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, నామా అరుణ,యడ్ల గంగాభవాని వీరమల్లు యాదవ్, నిమ్మల వెంకన్న, జ్యోతి కరుణాకర్, ,గట్టు జ్యోతి, ఫారుక్,  నేరెళ్ళ మధు, బైరబోయిన శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, పాలడుగు పరశురామ్,పిల్లల రమేష్ నాయుడు, సాజిద్ ఖాన్,స్వామి నాయుడు, సైదిరెడ్డి,తండు శ్రీను,ధర్మా నాయక్, వల్దాస్ దేవేందర్,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love