పట్నం పిల్ల వచ్చేసింది..

Patnam child has arrived..‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యువ కథానాయకుడు తేజస్‌ కంచర్ల తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్‌ ఉరికిఫైడ్‌’ అనేది సినిమా ట్యాగ్‌ లైన్‌. సెప్టెంబర్‌ 13న సినిమా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ మూవీ నుంచి ‘పట్నం పిల్ల..’ అనే సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇది గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాల ప్రధానంగా సాగే చిత్రం. హీరోయిన్‌ పట్నం నుంచి సెలవులకు పల్లెటూరుకి వస్తుంది. అక్కడ హీరో ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు. తన మనసులోని ప్రేమలో తెలియజేసేందు తను పడే పాట్లు, మనసులోని భావాలను వ్యక్తం చేసే పాట అని అర్థమవుతుంది. ఈ చిత్రానికి ప్రవీన్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాయగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. లీడ్‌ ఎడ్జ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది.

Spread the love