26న కూకట్‌పల్లిలో పవన్ ప్రచారం

నవతెలంగాణ- హైదరాబాద్: కూకట్‌పల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆ పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘ఈనెల 26న కూకట్పల్లిలో పవన్ ప్రచారం చేస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి పలు సభల్లో పాల్గొంటారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి సీట్ల కోసం మేము ప్రయత్నించాం. అనివార్య కారణాలతోనే శేరిలింగంపల్లి సీటు వదులుకోవాల్సి వచ్చింది’ అని నాదెండ్ల తెలిపారు. ఇది ఇలా ఉండగా, బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా.. మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి పెద్దపీట వేశారు. ధరణి స్థానంలో మీ భూమి యాప్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, వరి క్వింటాలుకు రూ.3100 మద్దరు ధర, నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, ప్రతీ ఐదేళ్లకోసారి ఉద్యోగులకు పీఆర్సీ, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి 10 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.

Spread the love