అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్..

నవతెలంగాణ-హైదరాబాద్ : వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉపవాస దీక్షలో ఉన్న పవన్ నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత భేటీ జరిగే అవకాశం ఉంది. కాగా, పలు పార్టీలకు చెందిన నేతలు నేడు పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.

Spread the love