హైదరాబాద్ లో చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్..

నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ కలిశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోపై వీరు చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేశారు. సీట్ల పంపకాలు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా స్వల్ప చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. అయితే ఈ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారా? లేదా? అనే విషయంలో క్లారిటీ రాలేదు.

Spread the love