ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్

నవతెలంగాణ-హైదరాబాద్ : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలవడం తీవ్ర ఆవేదన కలిగించిందని వెల్లడించారు. శుభకార్యానికి వెళుతున్న బృందం ప్రమాదం బారినపడడం బాధాకరమని వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు.

Spread the love