పెండింగ్‌ పాల బిల్లులు చెల్లించండి

– సీఎంకు మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాల ఉత్పత్తి సహకార సంఘాల పెండింగ్‌ బకాయిలు రూ.80 కోట్లను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారంనాడాయన బహిరంగ లేఖ రాసారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేవారమనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.80 కోట్ల విలువైన 45 రోజుల పాల బిల్లులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. పాడి రైతులు అప్పులు చేసి పశువుల్ని కొనుగోలు చేశారనీ, బ్యాంకు కిస్తీలు కట్టలేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

Spread the love