పైళ్ల శేఖర్ రెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించాలి

నవతెలంగాణ- వలిగొండ రూరల్

రానున్న సార్వత్రిక అసంబ్లీ ఎన్నికల్లో భువనగిరి బిఆరెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పడమటి మమతా నరేందర్ రెడ్డి  అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఇంటింటికి తిరిగి ఈ నెల 30 న జరుగనున్న ఎన్నికల్లో శేఖర్ రెడ్డికి అత్యధిక ఓట్లు గెలిపించాలన్నారు.  ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతు సీఎం కేసీఆర్ సారథ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు  ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చేగురి జంగయ్య, ఎంపీటీసీ భారతమ్మ గోపాల్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love