ఒకే రోజు రూ.1, 180 కోట్లు రైతులకు చెల్లింపు

– మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు శుక్రవారం ఒకే రోజు రూ.1,180 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి నిధుల ఇబ్బంది లేదని తెలిపారు. 7,030 పైగా కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Spread the love