నవతెలంగాణ హైదరాబాద్: నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడేనని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. ‘‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. తెలుగు చిత్రసీమకి.. కాంగ్రెస్‌కు విడదీయరాని బంధం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కృషి వల్లే తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చింది. స్టూడియోల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే భూములిచ్చింది. పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహంపై భారాసకు ధ్యాస ఎందుకు లేదు? ఈ – రేసింగ్‌లో స్కామ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. అందులో కేటీఆర్ అక్రమాలు చేసినట్టు తేలితే చర్యలు తప్పవు’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.