నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థి నాయకుడు పోకల సాయికుమార్ అక్రమ అరెస్టును పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆర్ గురువారెడ్డి, కోకన్వీనర్లు కొండా నాగేశ్వర్, ఎ వినరుబాబు, ఈ రఘునందన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయికుమార్ మీద బైండోవర్ చేసి పోలీసులు ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా సాయికుమార్ విద్యార్థుల పక్షం ఉంటే తప్పుడు ఆరోపణలతో కుట్ర కేసుకు పోలీసులు తెరదించుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో హోంమంత్రి, డీజీపీ జోక్యం చేసుకుని సాయికుమార్‌ను విడుదల చేయాలని కోరారు.
ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఖండన
సాయికుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు విమలక్క, మోహన్ బైరాగీ, మల్సుర, మల్లేశం, బాపురావ్, విజరు, నాగిరెడ్డి, అనసూయ, సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్నారని, ప్రగతిశీల ఉద్యమంలో కొనసాగాడని తెలిపారు. ఆయన్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ ఖండించాలని కోరారు.