యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలి: పిడిఎస్ యూ

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోరుతూ ప్రవేశపెట్టాలని కోరుతూ పిడిఎస్ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు.  ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, జయంతి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేక, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు కట్టలేక నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కోసం హైదరాబాద్ ఇతర పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారని, గతంలో ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్ లో పెడతామని పాలకులు హామీ ఇచ్చారని, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ సాయి, అక్షయ్ మణికంఠ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love