నవతెలంగాణ – హైదరాబాద్: అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కు బాధ్యతల్ని శాంతియుతంగా, సక్రమ పద్ధతిలో బదిలీ చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ట్రంప్‌తో నిన్న మాట్లాడాను. విజయంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. బాధ్యతల బదలాయింపును అత్యంత సక్రమంగా జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశిస్తానని ఆయనకు హామీ ఇచ్చాను. ఓడినప్పటికీ, ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కమలా హారిస్ గర్వించాలి’ అని పేర్కొన్నారు.