ముక్త ఏ2 సినిమాస్‌కు జరిమానా..

నవతెలంగాణ – హైదరాబాద్‌: ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురిచేసినందుకు HYDలోని ముక్త ఏ2 సినిమాస్‌కు వినియోగదారుల కమిషన్ ఫైన్ వేసింది. 2023లో నిష్ఫర్ అనే వ్యక్తి సినిమాకు వెళ్లారు. ప్రేక్షకుడు హాయిగా సినిమా చూసే వాతావరణం కల్పించకుండా ఇబ్బంది పెట్టిన ముక్త ఏ2 సినిమాస్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేయడంతో పాటు ఫిర్యాదిదారు వేదనకు పరిహారంగా రూ.3 వేలు, కేసు ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతం ఆనంద్‌నగర్‌కు చెందిన నేరోళ్ల నిష్పర్‌ ఫిర్యాదును విచారించిన కమిషన్‌ ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది

Spread the love