ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

Pending bills should be released in e-Kuber– ఉప ముఖ్యమంత్రి భట్టికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులు ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆ బిల్లులు 2023, మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మళ్లీ మార్చి వస్తే రెండేండ్లు పూర్తవుతాయని వివరించారు. జీపీఎస్‌, పార్ట్‌ ఫైనల్‌ బిల్లులు, సరెండర్‌ బిల్లులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు, జీఎల్‌ఐ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దానివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love