– సీఎం రేవంత్‌రెడ్డికి పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలతోపాటు రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, మెడికల్, సరెండర్ లీవులు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, రెగ్యులర్ వేతనాలకు సంబంధించి సప్లిమెంటరీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందించి పదోన్నతులు కల్పించాలని కోరారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనం వర్తింపజేయాలని సూచించారు. గురుకులాల సమయపాలనను సవరించాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలను చెల్లించాలని కోరారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామంటూ సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ మాజీ బాధ్యులు పి వెంకట్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, గుండు లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.