– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు
నవతెలంగాణ – బొమ్మలరామారం
ప్రభుత్వం తక్షణమే పెండింగ్ ఫీజు రీయంబర్స్ మెంట్స్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలినిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు. మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఆరేండ్ల నుండి రూ.8 వేల కోట్ల పైగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. గత 12 నెలలు నుండి తమకు అద్దె చెల్లించడం లేదని అద్దె చెల్లించకపోవడంతో తాము చేసేది ఎమిలేక మూసివేస్తున్నామని ప్రకటిస్తున్నారు. విద్యాసంస్థకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ అంతా బయటే ఉన్నారని అధికారులు మాట్లడుతున్న తాళ్లలు తీయడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. ఒక్కప్రక్క ఇంటిగ్రేడెడ్ గురుకులాలు అంటూనే ఉన్న గురుకులాలు సమస్యలు పరిష్కారం చేయడం లేదని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో తాళాలు వేయడం తో మరింత సమస్యలు తీవ్రతరం అవుతాయని తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని, పేద విద్యార్థులు నష్టం లేకుండా తక్షణమే ప్రభుత్వం ఫీజులను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ధరావత్ జగన్ నాయక్ , వెంకటేష్, వంశి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.