పెండింగ్ లో ఉన్న రూ.8000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి 

Pending scholarship fee arrears of Rs.8000 crore should be released– పిడిఎస్ యు రాష్ట్ర కోశాధికారి జి సురేష్
నవతెలంగాణ –  కామారెడ్డి                       
సమాజంలో క్రియాశీలకంగా ఉన్న విద్యా రంగoపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కెసిఆర్ ను తెలంగాణ సమాజమంతా ఎలా విస్మరించిందో అదే గతి కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని పి డి యస్ యూ రాష్ట్ర కోశాధికారి జి సురేష్  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని బ్రష్టు పట్టించిందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, విద్యార్థులు, యువకులు యావత్ తెలంగాణ సమాజమంతా ఏకమై గద్దదించారని నేడు అదే పోకడలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా, వైద్య రంగాలను విస్మరించే బడ్జెట్ ను ప్రవేశపెట్టి చేతులు దులుపుకుందని  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పాలనంటూ ఊదరగొడితే సరిపోదని దానికి తగిన ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి కేవలం ఒక్క శాతం మాత్రమే పెంచి విద్యారంగం పట్ల తన కపటనీతిని బహిర్గతం చేసిందని  అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ విచారణ ధ్వంసం అయిందని ఆ సమస్యలను పరిష్కరించేందుకు 7.31 శాతం ఏమాత్రం సరిపోదని, ఈ బడ్జెట్ కేవలం విద్యా రంగంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు మాత్రమే కేటాయించబడుతుందని తెలిపారు. నూతన గురుకులాలకు సొంత భవనాలు, స్థలాల కేటాయింపు ఇప్పటివరకు లేదని, ఇంటర్ డిగ్రీ కళాశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందని, యూనివర్సిటీలలో కనీసం వైస్ ఛాన్స్లర్  బోధన సిబ్బంది లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని, రాష్ట్ర విద్యార్థులకు 8 వేలకు పైగా స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ నేటికీ మంజూరు చేయలేని దుస్థితి తెలంగాణలో ఉంటే నామమాత్రపు బడ్జెట్ ను కేటాయించి విద్యారంగాన్ని మరింత దిగజార్చడం సరైనది కాదని, తక్షణమే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్  ప్రభుత్వ ఐటిఐ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు మరే ఇతర విద్యాసంస్థలు ఏర్పాటు అయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమైతామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నవీన్, ప్రవీణ్, శ్రీనివాస్, శ్రీకాంత్, మహేష్, నవీన్ విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love