నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్‌డౌన్ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్‌పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు. గురువారం హైదరాబాద్ జేటీసీపై ఆటో యూనియన్ నేత ఒకరు దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రవాణాశాఖ కమిషనర్‌తో చర్చల అనంతరం పెన్‌డౌన్ ఆలోచనను విరమించుకుని నల్లరిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. కాగా.. దాడి చేసిన అమానుల్లాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.