కాల్వపల్లి లో కూలిన పెంకుటిల్లు

నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం మాదిరెడ్డి లక్ష్మి భర్త బుచ్చిరెడ్డి గారి పెంకుటిల్లు అకాల వర్షానికి కూలిపోయింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో, అయోమయంలో పడిపోయింది. పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love