
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్మించిన పెన్షనర్స్& సీనియర్ సిటిజన్స్ భవనమును ఏప్రిల్ 17 (గురువారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి భవనాన్ని ప్రారంభిస్తారని, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అధ్యక్షత వహిస్తారని, నిజాంబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరు కానునట్లు వారు తెలిపారు. నూడా చైర్మన్ కేశ వేణు అడిషనల్ కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్, ట్రెజరరీ అధికారి దశరథ్, స్త్రీ అండ్ శిశు సంక్షేమ, వృద్ధుల శాఖ అధికారి రసూల్ బి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి తదితరులు హాజరుకానట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ నిజామాబాద్ అధ్యక్షులు శిరప హనుమాన్లు. జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ హమీదుద్దీన్, కోశాధికారీ ఈవీఎల్ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్, అశోక్, సిరప్ప లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.