పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేయాలి 

Pensions should be distributed properly– సోమ మల్లారెడ్డి సీనియర్ సీపీఐ(ఎం) నాయకులు 

నవతెలంగాణ – గోవిందరావుపేట 
ఆసరా పెన్షన్లను అధికారులు సక్రమంగా పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సోమ మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పసర సుందరయ్య నగర్ లో ఏర్పాటైన పెన్షన్ దారుల సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడారు. అధికారులు పెన్షన్ దారులకు చిల్లరగా ఇచ్చే రూ.16 రూపాయలను ఇవ్వకుండా నొక్కేస్తున్నారని అన్నారు. ఎన్నోసార్లు ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని అన్నారు. పలువురు ప్రజా పతినిధులు మండల సర్వసభ్య సమావేశాల్లో దృష్టికి తీసుకువచ్చిన పరిష్కరించే వారి కరువయ్యారని అన్నారు. చిల్లర తెచ్చుకుంటేనే రూ.16 రూపాయలు ఇస్తామని లేకపోతే ఇవ్వమని అధికారులు చెబుతున్నారని పెన్షన్ దారులు తెలుపుతున్నారని అన్నారు. గతంలో చనిపోయిన వారి పెన్షన్లు కాజేసిన అధికారుల పై ఫిర్యాదు చేసిన ప్రభుత్వము నుండి స్పందన కరువైందని అన్నారు. పెన్షన్లు సక్రమంగా పంపిణీ అవుతున్నాయా లేదా అని పరిశీలించే అధికారులే లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈసారి పంపిణీ సమయంలో ఆసరా పెన్షన్లు పూర్తిస్థాయిలో పెన్షన్ దారులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పెన్షన్దారులు పాల్గొన్నారు.
Spread the love