నవతెలంగాణ – కంఠేశ్వర్
సంక్రాంతి పండగ సెలవులకు వెళ్లే ప్రజలు పోలీస్ శాఖ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ శనివారం తెలియజేశారు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. ఊరెళ్తున్నామన్నా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దు.డోర్స్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడండి. గ్రామాలలోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వండి. సి.సి కెమెరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటు ఉండండి.అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీస్ వారికి తెలియజేయాలన్నారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం, రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది. అట్టి వారిపై నిఘా ఏర్పాటు చేయించవలెనని తెలియజేశారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇంట్లొ కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకండి.కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. పోలీస్ శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. లేదా డయల్ 100 ను సద్వినియోగం చేసుకోవాలని పలు సూచనలను తెలియజేశారు.