మహిళల పోరాటం వృథా కాదని ప్రజలు నిరూపించారు : వినేశ్ ఫొగాట్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన గెలుపుపై మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేశ్ ఫొగాట్ స్పందించారు. ఇక్కడి నుంచి సమీప బీజేపీ అభ్యర్థిపై ఆమె 6 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. తన గెలుపు అనంతరం ఆమె మాట్లాడుతూ… ఇది ఎల్లప్పుడూ దేశంలో పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి గెలుపు అన్నారు. మహిళల పోరాటం వృథా కాదని ప్రజలు నిరూపించారని వ్యాఖ్యానించారు. ఈ దేశం తనకు ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ నిలబెట్టుకుంటానన్నారు.

Spread the love