బహుజనులు అప్రమత్తంగా ఉండాలి

– జిల్లా కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం చైర్మన్ దండు రమేష్
నవతెలంగాణ: భూపాలపల్లి : మలహార్ రావు.
మంథని బి ఆర్ ఎస్ ఇంచార్జి పుట్టా మధుకర్ కు “బి” టీమే బహుజన ఐఖ్య సమితి ఈ బహుజన ఐఖ్య సమితికి రాష్ట అధ్యక్షడు అని చెప్పుకునే భూపెళ్లి రాజు అనే వ్యక్తి పుట్ట మధుకర్ కు ప్రధాన అనుచరుడు.ఇతను మంథని నియోజకవర్గ ప్రాంతంలో దొరల సిద్ధాంతాలతో,దొరల పార్టీలో దొరకు బానిసలుగా పనిచేస్తూన్నాడు BRS (TRS) మంథని నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట మధుకర్ కు B టీమ్ గా బహుజన ఐఖ్య సమితి అనే పేరుతో దళిత బహుజనుల ను మభ్యపెడుతూ వివిధ పార్టీలలో ఉన్న నాయకులకు కరపత్రాలు ఇచ్చి వారితో ఫోటోలు దిగి వాళ్ళ సొంత కరపత్రం లాంటి ఒక పేపర్ లో ఆ ఫోటో లు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు  తప్పుడు వార్తలు రాస్తూ,తప్పుడు ప్రచారం చేసుకుంటూ దళిత సమాజాన్ని అయోమయానికి గురిచేస్తున్నారు బహుజనులు మరి ముక్యంగా దళితులు జాగ్రత్త వహించాలని జిల్లా కాంగ్రెస్  పార్టీ దళిత విభాగం చైర్మన్ దండు రమేష్ అన్నారు
ఈ సందర్బంగా అయన మండలం కేంద్రం తాడిచర్ల లో విలేకరుల తో మాట్లాడుతూ బహుజనవాదం,అంబెడ్కర్ వాదం అనే ముసుగులో అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ దళితుల ఓట్లతో మళ్ళీ ఒకసారి లబ్దిపొందాలని చూస్తున్నారు అని మీరు నిజాంగా దళిత జాతికి,బహుజనవాదానికి,అంబెడ్కర్ వాదం మీద శిత్తశుద్దే ఉంటే మీరు ముందు దళిత వ్యతిరేక పార్టీ అయిన ఆ దొరల పార్టీ BRS (TRS) కి రాజీనామా చేసి దళిత,బహుజన సమాజంలో కి రావాలి ని పిలుపునిచ్చారు  అంతే కానీ దళిత వ్యతిరేకి,బహుజన వ్యతిరేకి అయినటువంటి మీ నాయకునికి “బి” టీమ్ గా దళిత,బహుజన వాదాన్ని ఎత్తుకున్నారు అని ఆయన అన్నారు  ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక 2014 తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉండే మన మంథని ప్రాంతంలో దళితుల మీద దాడులు,దళిత గుడాల మీద దాడులు,దళిత భూములు లాక్కోవడం, ఈ మంథని నియోజకవరం లో దళితులను టి ఆర్ ఎస్ చోట మోట నాయకులు కొట్టి చంపితే దోషులను కాపాడింది ఎవరో ప్రజలకు తెలుసు అని  అప్పుడు గుర్తుకు రాలేదా బహుజన వాదం..?అప్పుడు గుర్తుకు రాలేదా ఈ అంబెడ్కర్ వాదం..? అని ప్రశ్నించారు
మంథని ప్రాంతంలో దళితుల మీద గడిచిన 76 ఏళ్లలో ఏనాడు జరగని హింస,అణచివేత 2014 తర్వాతనే జరిగినట్టు క్రైమ్ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తోందని కొంతమంది దళిత సోదరులు దొర పార్టీలో పనిచేస్తూ బహుజన ఐఖ్యసమితి అని పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు,కానీ వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి మంథని ప్రాంతంలో మల్హర్ మండలం లోని రుద్రారంలో దళిత ( మాదిగ) గూడం దాడి చేసి గాయపర్చినప్పుడు, జాడి కవిరాజు చనిపోయినప్పుడు, పొద్దున పొద్దున్నే రెవెళ్లి రాజబాబును కొట్టి చంపినప్పుడు,మంథని మధుకర్ ను కొట్టి ఛాంపినప్పుడు ,శీలం రంగయ్య ను లాక్ అప్ డెత్ చేసి చంపినప్పుడు మీరెక్కడ ఉన్నారని  వీటిపైన బహుజన ఐఖ్య సమితి తమావిధానాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్  చేసారు

Spread the love