దోపిడీ దారులు కావాలా, ప్రజా సేవకుడు కావాలా ప్రజలే తేల్చుకోవాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ
– సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి, పోరాటాల సారధి పగడాల యాదయ్యను గెలిపించాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌
– 30 ఏండ్లుగా ప్రజా సేవా చేస్తున్నా..
– అసెంబ్లీకి పంపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా : సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్య
– బైక్‌ ర్యాలీతో కదం తొక్కిన ఎర్ర సైన్యం
– మంచాల మండలం ఎరుపుమయం..
నవతెలంగాణ-మంచాల

దోపిడీ దారులు కావాలా, ప్రజా సేవకుడు కావాలా ప్రజలే తెల్చుకుని ఓటు వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైపు మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, మరొక వైపు మల్‌రెడ్డి రంగారెడ్డి డబ్బులు సంచు లతో, మద్యంతో ఓట్లు కొనాలని చూస్తు న్నారనీ, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సేవ చేసే నాయకుడికే ఓట్లు వేసి, గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌ మాట్లాడుతూ ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకూ ఎర్ర జెండా నీడలో ఒరిగిన అమరుల ఆశయాలను ముందుకు తీసుకపోతు పోరా టాల సారథి ఇబ్రహీంపట్నం ముద్దు బిడ్డ పగడాల యాదయ్యను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్య మాట్లాడుతూ గత 30 ఏండ్లుగా మంచాల మండలంలో ఆరుట్ల పీఎసీఎస్‌ చైర్మెన్‌గా, మంచాల మండల ఎంపీపీగా, జడ్పీటీసీగా మండ లం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ డం జరిగిందన్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ప్రజా ఉద్యమాలు చేస్తున్నానని , నియోజక వర్గ ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే ప్రశ్నించే గొంతుకనై ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ పంపాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్‌ రాములు, స్కైలాబ్‌ బాబు, భూపాల్‌ మంచాల మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్‌ సుందర్‌, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి చేతాల జంగయ్య, అబ్దుల్లా మేట్‌ మండల కార్యదర్శి ఈ.నర్సింహ, యాచారం మండల కార్యదర్శి అలం పల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love