నవతెలంగాణ – కామారెడ్డి
పోచారం ప్రాజెక్టు దిగువనగల మండలాల లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. అధిక వర్షాలు కురుస్తుందన్న ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి ప్రాజెక్టు నుండి నీరు కిందికి వెళుతుందనీ, పోచారం ప్రాజెక్ట్ కింది ప్రాంతాలైన హవేలీ గన్ పూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఆలేరువాగు, పోచారంనది పరిసర ప్రాంతాలైన పోచంర్యాల్, సర్దానా, మాల్ తుమ్మెద, గోల్లింగల్, చినూర్ నాగిరెడ్డిపేట్, వెంకంపల్లి, తాండూర్ మాసన్ పల్లి, రుద్రారం గ్రామాల పంచాయతీ కార్యదర్శులు టాంటమ్ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.