నవతెలంగాణ – డిండి: డిండి మండల కేంద్రంలో ఒకే ఒక మీసేవ, ఆధార్ సెంటర్ ఉండడం వలన ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ… అతిపెద్ద మండలమైన గుండ్లపల్లి లో ఒకే ఒక మీసేవ ఆదార్ సెంటర్ ఉండడం మరో మీసేవ, ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల గుండ్లపల్లి, పరిసర గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చాలా వ్యయ, ప్రయాసాలకు ఓర్చి ప్రజలు డిండి కి వస్తే మీ సేవ, ఆధార్ సెంటర్ ల వద్ద పనికాక వట్టి చేతులతో వెళ్ళుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పథకాలను బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా పాలనలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను మీ సేవల సహకారంతో ముందుకు వెళుతున్న తరుణంలో ప్రజలు మీ సేవల దగ్గర పడిగాపులు కాయాల్సివస్తుందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డిండి మండల కేంద్రంలో మరియొక మీసేవ, ఆధార్ సెంటర్ ని మంజూరు చేయవలసిందిగా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను పత్రికాముఖంగా కోరుతున్నట్లు అన్నారు.