కాంగ్రెస్‌ మాటలు నమ్మిన ప్రజలు

– ఎఫ్డిసి చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్‌
తెలంగాణ అభివద్ధి ప్రదాత గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ పేరును ప్రజలు సువర్ణ అక్షరాలతో లిఖించినా తక్కువే అవుతుందని ఎఫ్డిసి చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన మాటలు ప్రజలు నమ్మి కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లలో అభివృద్ధి చేసిన ఘనత గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌కి దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు హామీలను గెలిచిన వంద రోజుల్లో అమలు చేస్తానని హామీ ఇచ్చిందన్నారు. గజ్వేల్‌ ప్రజలు కేసీఆర్‌ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు కతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్‌లో ఇంకా రూ.250 కోట్ల అభివద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు, బాగా పని చేసిన కార్యకర్తలు, నాయకులకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌. సి రాజమౌళి, ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఎంపీపీ దాసరి అమరావతి, జెడ్పిటిసి పంగమల్లేశం, కౌన్సిలర్లు బబ్బురు రజిత, తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్‌, గంగిశెట్టి చందన రవీందర్‌, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చెరుకు చంద్రమోహన్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, కర్ణాకర్‌ రెడ్డి,నవాజ్‌ మీరా, పండరీ రవీందర్‌ రావు, తిరుపతి రెడ్డి, పాల రమేష్‌ గౌడ్‌, గడియారం స్వామి చారి, ఏక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love