పాయం గెలుపునకు కృషి చేసిన ప్రజలు అభినందనీయులు

నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పినపాక నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపుకు కృషి చేసిన ప్రజలు, కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, టీజేయస్‌ నాయకులు, కార్యకర్తలు అందరూ అభినందనీయులని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని మిత్ర పక్షాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం రాష్ట్ర ప్రజలు నేడు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చి తీర్చుకున్నారని తెలిపారు. ఈ పినపాక అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాల నాయకుల కృషి, సహకారం ఎనలేనిదని కొనియాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సైతం ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ఆరు గ్యారంటీలను నెరవేరు స్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొందరు నాయ కులు ప్రస్తుతం ఎన్నికల ఫలితాల దృష్ట్యా స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరేం దుకు రంగం సిద్ధం చేస్తున్నారని, అటువంటి వారికి తగిన బుద్ధి చెబుతామని, అటువంటి వారి వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని, అది ఈ ఎన్నికలు నిరుపించాయని ఘాటుగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌, మిత్ర పక్షాల నాయకులు పడిగ సమ్మ య్య, నరెడ్ల వెంకన్న, మొహమ్మద్‌ అతహార్‌, కరకపల్లి సుధాకర్‌, రేసు ఎల్లయ్య, తులం ముత్తిలింగం, సయ్యద్‌ సాబీర్‌, నరెడ్ల రాంబాబు, నులకతాటి శ్రీనువాస్‌, సిరినోముల శ్రీనివాస్‌, గుంతోజు సదానందం, పోకల శ్రీను, గొగ్గెల భాస్కర్‌, షబ్బీర్‌, చిట్టి, ఢకొీండ మల్లేష్‌, రాము, నర్సింహారావు, నారాయణ, శేఖర్‌, రామనర్స య్య, ఈ.కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love