ఎర్రజెండా రాజ్యంలోనే ప్రజల బతుకులు మారుతాయి

People's lives will change in the red flag kingdom– కమ్యూనిస్టు కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాడే కేంద్రాలుగా ఉపయోగపడతాయి
నవతెలంగాణ – భూదాన్ పోచంపల్లి
కమ్యూనిస్టు కార్యాలయాలు రైతుల, వ్యవసాయ కూలీల, కార్మికుల, పేదల బతుకుల మార్పు కోసం, వారి హక్కుల కోసం పోరాడే కేంద్రాలుగా ఉపయోగపడతాయని ఎర్రజెండా రాజ్యంలోనే ప్రజల బతుకులలో మార్పు వస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం ఫిలాయిపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కళ్ళెం వీరారెడ్డి స్మారక భవనం సీపీఐ(ఎం) కార్యాలయం ను తమ్మినేని వీరభద్రం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేదే కమ్యూనిస్టులేని అన్నారు. పాలకులు ప్రజలకు అందించవలసిన విద్య, వైద్యం సరిగా ఇవ్వకపోవడంతో అనేకమంది పేదలు నిరుపేదలు సబండ వర్గాలు కార్పొరేట్ విద్యా, వైద్యం పొందలేక విద్యకు దూరమవుతూ వైద్యం పొందకా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎర్ర జెండా నీడన పరిపాలన జరుగుతున్న దేశాలతో విద్య వైద్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.
ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా లాభాలు వచ్చే రంగాలను అప్పజెప్తూ నిరుద్యోగుల పుట్టలు కొడుతూ ప్రజల బతుకులతో కులం పేరుతో మతం పేరుతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఆనాడు కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటము మొదలుకొని నేటి వరకు దున్నేవాడికి భూమి కావాలని వేలాదికరాల భూములను పేదలకు పంచారని తెలియజేశారు. గత ప్రభుత్వం పేదలకు, దళితులకు మూడెకరాల భూమి అమలు చేస్తానని చెప్పి చేయలేదని, ఈ ప్రభుత్వము భూములను అక్రమించుకున్న వారి నుండి హైడ్రా పేరుతో భూములను తిరిగి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, దీనితో ఆగకుండా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ భూమిలేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇంకా దేశంలో రాష్ట్రంలో సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని దాడులు దౌర్జన్యాలు కూడా నీటికి కొనసాగుతున్నాయని వేదన వెలిబుచ్చారు. అసమానతలు లేని రాజ్యం కోసం మనమందరము పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ అనుసరించే విధానాల్లో లోపాలుంటే ఎత్తిచూపుతామని, ప్రజలకు నష్టం చేస్తే ఉద్యమిస్తామని, పేదల తరఫున రైతుల తరఫున కార్మికుల కర్షకుల పక్షాన నిరంతరం ఎర్రజెండా చేతబట్టి పోరాడుతామని తమ్మినేని వీరభద్రం తెలియజేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. కామ్రేడ్ కళ్లెం వీరారెడ్డి భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన గొప్ప నాయకుడని వారి స్ఫూర్తిని ఈనాటి యువతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆనాడు దొరలకు జాగిర్రు దారులకు వ్యతిరేకంగా దున్నివాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి పోవాలని, కులవివక్ష పోవాలని పెద్ద ఎత్తున ఈ ప్రాంత సాయిధ పోరాట అమరవీరులు పోరాడినారని తెలియజేశారు. వీరారెడ్డి విద్య కోసం పాఠశాల ప్రారంభించి అందరికీ విద్యను అందించారని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తెచ్చారని తెలియజేశారు. గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూమిలేని పేదలందరికీ ఆనాడు 250 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను సాగు భూమి కోసం, ఇండ్ల స్థలాలు కోసం పంచారని, గ్రామంలో 20 సంవత్సరాల సీపీఐ(ఎం) పాలనలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపారని, కూలీ, భూమి, ఉపాధి, రైతాంగ సమస్యలపై రాజి లేని పోరాటాలు నడిపిన చరిత్ర ఈ ప్రాంత సీపీఐ(ఎం) ఉన్నదని, ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండా పక్షాన పేదలంతా నిలబడాలని వారు పిలుపునిచ్చా. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి పాల్గొని మాట్లాడగా ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు గూడూరు బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు జంగారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, బొడ్డుపల్లి వెంకటేష్, వనం ఉపేందర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, అందెల జ్యోతి, కోట రామచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు, బీబీనగర్ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దాడి శ్రీనివాస్, శాఖ కార్యదర్శి పత్తి బిక్షపతి, మండల నాయకులు నోముల కృష్ణారెడ్డి, లాలయ్య, కొటా రమేష్, కంజర్ల అశోక్, అందేల యాదయ్య, అందాల అశోక్, చుక్క రవి, పగిళ్ల మల్లారెడ్డి, పగిళ్ల లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love