ప్రజా సంఘాల గొంతు నొక్కుతున్నారు

– రాజ్యాంగ నిబంధనలు దుర్వినియోగం
– సీఎం కెసిఆర్ అక్రమ అరెస్టులను ఆపాలి 
– తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక..
ఉద్యమకారులపై ఉపా చట్టాల ప్రజా సంఘాల గొంతు నొక్కడం రాజ్యాంగ నిబంధనలు దుర్వినియోగం చేయడమే పనిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ హరగోపాల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కో కన్వీనర్ గడ్డం లక్ష్మణ్, రాఘవచారి,కే రవీందర్, పద్మశా లతో కలిసి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. ఉద్యమకారులు కవులు రచయితలు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు తెలంగాణ ఉద్యమంలో మమేకమై మీతో కలిసి పని చశారని  రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. వారి స్వభావం వారి జీవనశైలి ఎటువంటిదో మీకు తెలియనిది కాదని కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతూ ఉపా చట్టం క్రింద నమోదైన కేసులు 90 శాతం ఉత్తివేనని తేలిన ఇంతవరకు ఎందుకు దాన్ని ఉపసంహరించడం లేదు సమాధానం చెప్పాలన్నారు. అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేయవద్దని ఈనెల 26 నుండి జూలై 30 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో ఆరుగురిని ఉప చట్టం నుంచి ఉపసంహరించినట్టు మిగతా వారందరినీ కూడా ఈ చట్టం నుండి తప్పించి వారికి న్యాయం చేయాలని ఇటీవలే ఓ న్యాయవాది భర్త దేవేందర్నూ అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తున్నామన్నారు.స్థానిక జిల్లా అధికారికి తెలియకుండా అరెస్టు చేసిన వారు ఏ జిల్లా వారు తెలియకుండా పరీక్షా కేంద్రం నుండి చత్తీస్గడ్కు తీసుకువెళ్లిన వారు తిరిగి అతన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలన  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తనపై కూడా ఉపా చట్టం కింద నమోదు చేసిన కేసు
ములుగు ఎస్పి సరైన ఆధారాలు లేవని కొట్టి వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇటువంటి చట్టాల ద్వారా ప్రజాసంఘాల గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.
Spread the love