బోధన్ లో టీఆర్ఎస్ నాయకుల మహాసభకు తరలి వెళ్ళిన ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ -రెంజల్

బోధన్ పట్టణంలోని ఎన్ ఎస్ ఫ్  ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన బీఆర్ఎస్, మహాసభకు రెంజల్ మండలం సాతాపూర్ గ్రామం నుంచి మూడు బస్సులలో స్థానిక సర్పంచ్ వికార పాషా, ఎంపీటీసీ ఎస్ కే అహ్మద్ ల ఆధ్వర్యంలో ప్రజలు తరలి వెళ్లారు. ఈ మహాసభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభకు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు భూమేష్, మండల ఉపాధ్యక్షులు హాజీ ఖాన్, కే సాయిలు, ప్రేమ్ కుమార్, మహేష్, మహిళలు పాల్గొన్నారు..
Spread the love