రంధ్రాన్వేషణ!

ఎందుకింత అనుమానం, అవమానం? ఈప్రశ్నకు సమాధానం
జగమంతా తెలిసిందే. కేంద్రం నియంతృత్వ విధానాలను
ఎప్పటికప్పుడూ వ్యతిరేకిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నారు విజయన్‌.
రాష్ట్రాల హక్కులు హరిస్తున్న ప్పుడు గొంతెత్తుతున్నా, విపక్షాలను
ఐక్యం చేసేదిశగా అడుగులు వేస్తున్నా కేంద్రం తీసుకుంటున్న
అనాలోచిత నిర్ణయాలను తాము అమలు చేయబోమని
తేల్చిచెపుతున్నా అందుకు అనేక ఉదాహరణలు మన కండ్లముందే
ఉన్నాయి. నాడు వామపక్షాల ఒత్తిడితో పేదలకు పని కల్పించి
గౌరవంగా జీవించడానికి తీసుకొచ్చిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ
చట్టం పీకనులిమే చర్యలు తీసుకుంది మోడీ సర్కార్‌.
దాన్ని తిప్పికొట్టేలా ఉపాధి కార్మికులకు సంక్షేమ నిధి బోర్డును ఏర్పాటు చేసి ఊపిరి పోసింది కేరళ ప్రభుత్వం.
వందశాతం సంపూర్ణ అక్షరాస్యత. డిజిటల్‌ విద్యాబోధన. అట్టడుగువర్గాలకు అందుబాటులో వైద్యం. ప్రజలకు ఆర్థిక పరిపుష్టి. కార్మికుల సంక్షేమ నిధి. వ్యవసాయ రంగానికి పెద్దపీట. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సుంకాల తగ్గింపు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు, మరెన్నో విభిన్నమైన పద్ధతులు అక్కడే సాధ్యం. ప్రగతిశీలమైన సామరస్య పాలనలో దేశంలోనే తమదైన ప్రత్యేకత వారి సొంతం. భారతదేశ చిత్రపటంలో ఎక్కడో అరేబియా సముద్రంవైపు విసిరేసినట్టుగా, శ్రీలంకకు దగ్గరగా కనిపించే కేరళది అన్నింట్లో అగ్రస్థానమే. రాష్ట్రం చిన్నదే అయినా పెద్దపెద్ద లక్ష్యాలతో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ఇది లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ఆధ్వర్యంలో రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్‌ ఆదర్శ పాలనకు గీటురాయి. ప్రజాసంక్షేమంలో విజయవంతంగా దూసుకెళ్తున్న రాష్ట్రం ఏదని ఎవరినడిగినా కేరళ అని చెప్పే స్థాయికి ఎదగడం వామపక్షాలు అనుసరిస్తున్న విధానాల గొప్పతనం. అలాంటి కేరళలో అమలవుతున్న పథకాలపై కేంద్రం రంధ్రాన్వేషణ చేస్తోంది.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రజల నెత్తిపై ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తుందో, ఏం రద్దు చేస్తుందో, ఏ నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. కేంద్ర భారాలు, హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా తమ రాష్ట్రానికి నష్టమా, లాభమా అని బేరీజు వేసుకున్న తర్వాతే అక్కడ అమలుకు సిద్ధపడుతుంది కేరళ ప్రభుత్వం.ఇది కదా దేశానికి కావాల్సిన ముందుచూపు. ఇదికదా ప్రజలపట్ల చిత్తశుద్ధిని కనపరచడం. ఇది కదా తమపై నమ్మకం ఉంచి ఓట్లేసిన వారి బతుకులను చక్కదిద్దడం. కానీ ఇవేమీ బీజేపీ-ఆరెస్సెస్‌ నాయకులకు నచ్చవు. ఏ చిన్నతప్పు దొరుకుతుందా! దాన్ని పట్టుకుని ఎలా లాగుదామా అని గోతికాడి నక్కలా ఎదురుచూస్తుంటుంది. కానీ నిరంతరం పేదల కోసం తపించే కేరళ లాంటి రాష్ట్రాల్లో వీరి ఆటలు సాగవుకదా! అందుకే విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తీసిన ‘ది కేరళ స్టోరీ’ అట్టర్‌ప్లాప్‌ అయింది. అయినా అక్కడి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తోంది. 2022-23లో రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులలో 99 శాతం మందికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించామంటూ పినరయి ప్రభుత్వం ప్రకటించింది. కేరళ ప్రభుత్వం వెల్లడించిన వాస్తవాల్ని అక్కడి బీజేపీ-ఆరెస్సెస్‌ నాయకులు జీర్ణించుకోలేదు. తద్వారా అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో కేంద్ర విద్యాశాఖ, కేరళ ప్రభుత్వ అధికారులు సభ్యులుగా చేర్చింది. కేరళ ప్రభుత్వం చేసిన ‘అసంభవమైన’ ప్రకటనను పరిశీలించాలని కేంద్రం నిర్ణయించిందని విద్యాశాఖ సీనియర్‌ అధికారి చెప్పడం మోడీ ప్రభుత్వ ధోరణికి అద్దం పడుతోంది. పీఎం పోషణ్‌ యోజనకు సంబంధించి ఢిల్లీలో పీఏబీ జరిపిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో క్షేత్రస్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు కొన్ని జిల్లాల్లో పర్యటించాలని పీఏబీ నిర్ణయించింది.
ఎందుకింత అనుమానం, అవమానం? ఈప్రశ్నకు సమాధానం జగమంతా తెలిసిందే. కేంద్రం నియంతృత్వ విధానాలను ఎప్పటికప్పుడూ వ్యతిరేకిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నారు విజయన్‌. రాష్ట్రాల హక్కులు హరిస్తున్న ప్పుడు గొంతెత్తుతున్నా, విపక్షాలను ఐక్యం చేసేదిశగా అడుగులు వేస్తున్నా కేంద్రం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను తాము అమలు చేయబోమని తేల్చిచెపుతున్నా అందుకు అనేక ఉదాహరణలు మన కండ్లముందే ఉన్నాయి. నాడు వామపక్షాల ఒత్తిడితో పేదలకు పని కల్పించి గౌరవంగా జీవించడానికి తీసుకొచ్చిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పీకనులిమే చర్యలు తీసుకుంది మోడీ సర్కార్‌. దాన్ని తిప్పికొట్టేలా ఉపాధి కార్మికులకు సంక్షేమ నిధి బోర్డును ఏర్పాటు చేసి ఊపిరి పోసింది కేరళ ప్రభుత్వం. శాస్త్రీయతను రూపుమాపి పసిహృదయాల్లో మతబీజాలు నాటాలని కేంద్రం ఎన్‌సీఈఆర్‌టీ నుంచి డార్విన్‌ సిద్ధాంతాన్ని తొలగిస్తే రాష్ట్రంలో మాత్రం తొలగించ బోమని చెప్పింది. సహకార రంగానికి అనేక ప్రోత్సాహకాలిస్తూ పాడిపరిశ్రమలోనూ బలోపేతమైన క్షీరవిప్లవాన్ని తీసుకొచ్చింది. దేశమంతా నిరుద్యోగం తాండవిస్తుంటే కేరళలో మాత్రం గణనీయంగా తగ్గింది. పన్నెండు శాతం ఉన్న నిరుద్యోగరేటు ఐదుకు పడిపోయింది. మోడీ మాత్రం అధికారంలోకి రాకముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పి స్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే మరిచారు. ఇందుకు భిన్నంగా అనునిత్యం ప్రజల కోసం తపిస్తూ అనేక పథకాలు తీసుకొచ్చి అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉంది కేరళ ప్రభుత్వం. అలాంటిచోట బీజేపీ చేస్తున్న ఈ రంధ్రాన్వేషణ స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం కాకపోతే దేనికోసం?

Spread the love