పీరియ‌డ్ ట్రాక‌ర్ యాప్‌

Period tracker appఋతు చక్రం… ఏముంది ప్రతి నెలా వచ్చేదేగా అని చాలా మంది సులువుగా తీసుకుంటారు. కానీ తమ ఆరోగ్యంపై దీని ప్రభావం ఎంతో ఉంటుందనే విషయాన్ని మహిళలు గుర్తించలేకపోతున్నారు. పీరియడ్స్‌ సరిగ్గా వస్తున్నాయా లేదో, నొప్పి వుంటే ఎంత తీవ్రంగా ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది. తనలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై అస్సలు దృష్టి పెట్టడం లేదు. అలాంటి వన్నీ ట్రాక్‌ చేసేందుకు పీరియడ్‌ ట్రాకర్‌ యాప్‌ను సృష్టించారు ఇరా గుహా. అంతే కాదు అంతకు ముందు మెన్‌స్ట్రుల్‌ కప్‌లను కూడా పరిచయం చేశారు. పేద, గ్రామీణ మహిళలు, బాలికలకు కూడా ఇవి అందుబాటులో ఉండేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ఇరా గుహా ఏప్రిల్‌ 2021లో హార్వర్డ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ద్వారా పేటెంట్‌ పొందిన అసన్‌ మెన్‌స్ట్రువల్‌ కప్‌ను ప్రారంభించింది. మెడికల్‌-గ్రేడ్‌ సిలికాన్‌తో తయారు చేయబడిన ఈ మెన్‌స్ట్రువల్‌ కప్‌ ప్రత్యేకమైన రిమూవల్‌ రింగ్‌ని కలిగి ఉంటుంది. ఇతర కప్పుల కంటే దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ప్రతి అసన్‌ కప్‌ 10 ఏండ్ల పాటు పునర్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాదు ఇది సుమారు 6,500 శానిటరీ నాప్‌కిన్‌లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ‘ఒకటి కొనండి, ఒకటి విరాళంగా ఇవ్వండి’ అంటూ విక్రయించే ఈ కప్‌ పేద మహిళలకు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన స్త్రీలకి దీన్ని ఉచితంగా ఇస్తున్నారు
ఋతు చక్రాలను ట్రాక్‌ చేయడం
ఇప్పటి వరకు అసన్‌ లక్ష కప్పులకు పైగా విక్రయించబడింది. ఆసియా, ఆఫ్రికా, యూకే, ఈయూ వంటి 12 దేశాలలో అందుబాటులో ఉంది. మెన్‌స్ట్రువల్‌ కప్‌తో పాటు అసన్‌ ఇటీవలే పీరియడ్‌ ట్రాకర్‌ యాప్‌ను కూడా విడుదల చేసింది. యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. మహిళలు, బాలికలు వారి ఋతు చక్రాలను ట్రాక్‌ చేయడంలో, అనారోగ్య సమస్యలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. గత ఏడాది అసన్‌ కార్టియర్‌ ఉమెన్స్‌ ఇనిషియేటివ్‌ ప్రైజ్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌, ఇన్నోవేట్‌ యూకే అన్‌లాకింగ్‌ పొటెన్షియల్‌ అవార్డులను అందుకుంది.
స్త్రీ ఆరోగ్య సూచిక
ఒక మహిళ పిల్లలను కనాలనే నిర్ణయం తీసుకునేటపుడు పీరియడ్స్‌ రెగ్యులర్‌గా ఉందా, పీరియడ్స్‌ నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా తక్కువ మంది మాత్రమే మెనోపాజ్‌ గురించి మాట్లాడుతారని గుహ అంటున్నారు. ‘పీరియడ్‌ యాప్‌ స్పేస్‌లో ప్రతి ఒక్కటి సంతానోత్పత్తికి సంబంధించి రూపొందించబడింది. గర్భధారణ సమయం, అండం విడుదల వంటివి ఎలా ట్రాక్‌ చేయాలో తెలుసుకోవచ్చు. అసన్‌లో మేము మహిళలకు వారి పీరియడ్‌ మొత్తం వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంగా చెప్పదలచుకున్నాం’ అని ఆమె జతచేస్తున్నారు. ఇది ఋతు చక్రానికి సంబంధించిన అన్ని అంశాలను కవర్‌ చేస్తుంది. పీరియడ్స్‌ సమయంలో వారి మనోభావాలు, లక్షణాలను ట్రాక్‌ చేయడానికి సహకరిస్తుంది.
ఎప్పుడైనా తొలగించుకోవచ్చు
ఈ యాప్‌ నుండి వినియోగదారులు తమ ఖాతాలను ఎప్పుడైనా తొలగించుకోవచ్చు. యాప్‌లోని ఎన్విరాన్‌మెంటల్‌ ట్రాకర్‌ మహిళలు తమ పీరియడ్‌ ప్రొడక్ట్‌ల కార్బన్‌ పాదముద్రను ట్రాక్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది. ‘మీరు ప్యాడ్‌లు లేదా టాంపాన్‌ల నుండి కేవలం ఆసన్‌ కప్‌కి మాత్రమే కాకుండా, క్లాత్‌ ప్యాడ్‌లు, పీరియడ్‌ లోదుస్తులు ఎలా ఇతర వేటికైనా మారినట్లయితే మీ కార్బన్‌ పాదముద్రను ట్రాక్‌ చేయవచ్చు. మీరు ల్యాండ్‌ఫిల్‌లకు వెళ్లడం, డబ్బు ఆదా చేయడం, కార్బన్‌ ఉద్గారాలను నివారించడంలో ఎంత వరకు సహకరిస్తున్నారో ఇది మీకు తెలియజేస్తుంది’ అని ఆమె వివరిస్తున్నారు.
మహిళల నేతృత్వంలోని జట్టు
సాఫ్ట్‌వేర్‌ డిజైనర్లు, ఫ్రంట్‌-ఎండ్‌ డెవలపర్‌ల నుండి బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌ల వరకు ఈ యాప్‌ను డెవలప్‌ చేసిన టీమ్‌ అంతా మహిళలే. దీన్ని రూపొందించేటప్పుడు పాల్గొన్న ప్రతి వ్యక్తి తమ గురించి తాము ఆలోచించారని, అందుకే అందరి ఉపయోగానికి వీలుగా సరళంగా, సహజంగా మారుస్తున్నారని గుహ చెప్పారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్‌ ఇప్పటికే 1,000 డౌన్‌లోడ్‌లను దాటింది. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. కప్‌ కొనుగోలు చేసిన ప్రతి కొత్త వినియోగదారుకు యాప్‌కి డౌన్‌లోడ్‌ లింక్‌తో ఇమెయిల్‌ పంపబడుతుంది. భవిష్యత్తులో ఆరోగ్య సందేహాలకు సమాధానమివ్వడానికి యాప్‌కి ఏఐ చాట్‌బాట్‌ను జోడించాలని గుహా భావిస్తున్నారు.
అసన్‌ సామాజిక అంశం
భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా బ్రాండ్‌ వృద్ధి చెందిందని గుహా పంచుకున్నారు. అలాగే మెన్‌స్ట్రువల్‌ కప్‌ వ్యాపారం రెండు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది. లాభాపేక్షతో కూడిన ణ2జ వ్యాపారం, సామాజిక ప్రభావం అంశం. ‘మేము Shopify, Amazonలో భారతదేశం, యూకే, ఇయూలో విక్రయిస్తాం. మేము అమెజాన్‌ సస్టైనబిలిటీ యాక్సిలరేటర్‌లో భాగమయ్యాము. మేము కప్పును క్రిమిరహితం చేయడానికి మెన్‌స్ట్రువల్‌ కప్‌ క్లెన్సర్‌ని ప్రారంభించాం. అలాగే ఒక లూబ్రికెంట్‌ను కూడా ప్రారంభించాం. తద్వారా టీనేజ్‌లు కప్పును చొప్పించడాన్ని సులభతరం చేసాము. ఈ లైన్‌లో కూడా ఇతర ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని పంచుకున్నారు.
గ్రామీణ మహిళలు ఖర్చు పెట్టలేరు
అసన్‌ ఇప్పటికీ ‘ఒకటి కొనండి, ఒకటి విరాళం ఇవ్వండి’ అనే విధానానికి కట్టుబడి ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన లక్షలాది మంది మహిళలు, బాలికలు ఉన్నందున ఇది సరిపోదని గుహా చెప్పారు. ‘మేము అధిక శాతం మహిళా కార్మికులు ఉన్న ఫండర్లు, లాభాపేక్ష లేని సంస్థలు, తయారీ సంస్థల నుండి కొన్ని ఇన్‌బౌండ్‌ అభ్యర్థనలను పొందాము. రాయితీ ధరలకు కప్పును విక్రయిస్తున్నాము. ఇందులో భాగంగా విద్య, శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాము’ అని ఆమె జతచేస్తున్నారు. బెంగుళూరులోని కనకపురలో, అసన్‌ యాప్‌ను ప్రారంభించిన సమయంలో 10 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు 100 గ్రామాల్లో 30,000 కంటే ఎక్కువ మంది మహిళలు, బాలికలు దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెన్‌స్ట్రువల్‌ కప్‌ దత్తత కార్యక్రమంగా మారింది. ఎందుకంటే గ్రామాలలో మహిళలు శానిటరీ ప్యాడ్‌ల కోసం డబ్బు ఖర్చు చేయరు. కనుక వారికి సహకరించాలని గుహ ఈ కృషి చేస్తున్నారు. మలావిలో 5,000 కంటే ఎక్కువ అసన్‌ కప్పులను పంపిణీ చేసింది. సైన్యంతో ఒక ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించిన జాంజిబార్‌లో 2,000 కప్పులను పంపిణీ చేసింది. వారు త్వరలో యూఎస్‌, ఫ్రాన్స్‌, జర్మనీలలో ప్రారంభించాలని చూస్తున్నారు.

Spread the love