మద్యం షాపుల వద్ద పర్మిట్ రూంలను నియంత్రించాలి

– బహుజన మహిళా సంఘం (బిఎంఎస్) రాష్ట్ర కన్వీనర్ -సబ్బని లత డిమాండ్
నవతెలంగాణ-కంటేశ్వర్
మద్యం షాపుల వద్ద పరిమిట్ రూములను నియంత్రించాలని బహుజన మహిళా సంఘం బిఎంఎస్ రాష్ట్ర కన్వీనర్ సభాని లత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాయకష్టం చేసే ప్రజలను మద్యానికి బానిసలుగా తయారు చేసిందని బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత విమర్శించారు.ఉమ్మడి రాష్ట్రంలో మద్యంపై ఆదాయం 7 వేల కోట్ల రూపాయలు వస్తే రాష్ట్రంలో ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చి దాదాపు 27 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటుదని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన బహుజన మహిళా సంఘం (బిఎంఎస్) జిల్లా కమిటి జనరల్ బాడీ సమావేశంలో సబ్బని లత మాట్లాడుతూ ప్రతి మద్యం షాపు పక్కనే పర్మిట్ రూంల పేరుతో కల్లు బట్టి లాగా వందలాది మందితో ఉదయం నుండి రాత్రి 11వరకు మ్యదం షాపులు, మరోవైపు ఎలాంటి పర్మిషన్ లేకుండా వేలాది బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
బహుజన మహిళా సంఘం జిల్లా కమిటి ఎన్నిక
అనంతరం బహుజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలుగా గీతాంజలి, ప్రధాన కార్యదర్శిగా దండు జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఆకుల సుజాత, సహాయ కార్యదర్శి ఎం.శోభ, కమిటి సభ్యులు పద్మ, విఠ్ఠం లావణ్య, పి.సునీత,సమీన, జి.లావణ్య ,జి. దివ్య, వేల్పూర్ నీలా, ఎన్.సంగీత, శారద లు ఎన్నికయ్యారు.

Spread the love