పీటరా కంపెనీ తినుబండారాలు రద్దు చేయాలి..

– సీఐటీయూ ఆధ్వర్యంలో దుబ్బాక తహశీల్దార్  కార్యాలయం ఎదుట ధర్నా
– తహశీల్దార్ సలీమ్ మియాకి వినతి 
– కార్మికులకు అదనపు భారం మోపొద్దు 
– దేశాయ్ బీడీ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి 
– తెలంగాణ బీడి& సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి జి.భాస్కర్
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
పీటారా కంపెనీ “పేరుతో దేశాయి బీడీ యాజమాన్యం తిను బండారాలను మార్కెట్లోకి తీసుకొచ్చి…. బీడికార్మికులను కొనుగోలు చేయాలని చేస్తున్న ఒత్తిడిని ఉపసంహరించుకోవాలని, వెంటనే దేశాయి బీడీ కార్మికులకు పిటార పేరుతో సరఫరా అవుతున్న పల్లీలు,బఠాణీ,చిప్స్ ప్యాకెట్లు రద్దు చేయాలని తెలంగాణ బీడి& సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి జి.భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మికులపై పడుతున్న అదనపు భారం, శ్రమ దోపిడీని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దుబ్బాక మండల కేంద్రంలోనీ తహశీల్దార్  కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం దేశాయ్ బీడీ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ సలీమ్ మియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడి& సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధనకార్యదర్శి జి.భాస్కర్ మాట్లాడుతూ” దుబ్బాక మండల కేంద్రంలోని దేశాయి బీడీ పరిశ్రమ” పిటార కంపనీ పేరుతో ” కురుకురే ప్యాకెట్లతో పాటు ఇతర (తినుబండారాల) ప్యాకెట్లను కొనాలని దేశాయ్ బీడీ పరిశ్రమ బీడీ కార్మికులపై ఒత్తిడి చేయడంతో పాటు వివిధ బ్రాంచీలలో పనిచేస్తున్న బీడీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. దేశాయ్ బీడి కంపనీ పైన చట్టరీత్య చర్యలు తీసుకొని బీడీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మార్కెటింగ్ కొరకు బీడీ కార్మికులపై “కురుకురే ప్యాకెట్ల”ను బలవంతంగా కొనుగోలు చేయించడం సరైన పద్దతి కాదన్నారు. బీడీ కార్మికులు ఆకు,తంబాకు కొరకు మరియు బీడీలు చుట్టి టేకేదారుకు అప్పగించేటప్పుడు ‘కురుకురే ప్యాకెట్లను తీసుకోవాలని, వాటిని అమ్మి (ఒక్కొక్క ప్యాకెట్టు ఖరీదు ఐదు రూపాయలు చొప్పున) నెలకు రూ”300 నుండి రూ”500 వరకు డబ్బులు తీసుకురావాలని ప్రతి కార్మికురాలకు టేకేదారులు బలవంతంగా ఒత్తిడి చేయడం మానుకోవాలన్నారు. గత రెండు నెలలుగా ఈ స్నాక్స్ (తినుబండరాలు )తిని చిన్న పిల్లలు అనారోగ్యంతో హాస్పిటల్ భారీన చేరుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు దేశాయ్ బీడి యాజమాన్యం ఒత్తిడిని వ్యతిరేకించే టేకేదారులపై, బీడి కార్మికుల పైన యాజమాన్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుటం ఎంతవరకు సమంజసం అన్నారు..బీడీ కార్మికులు ప్యాకెట్లు ఇంట్లోనే నిల్వ చేసుకొని డబ్బులు చెల్లించాల్సిన దుస్థితిని నేడు దేశాయ్ బీడీ కంపెనీ తీసుకొచ్చిందని మండిపడ్డారు. బీడీ కార్మికులకు ఆకు, తంబాకులో  కోతలు విధిస్తూ నేడు ఈ ముడిసరుకులు కొనుగోలు చేసి బీడీలు తయారు చేయటంతో కనీస వేతనాలు లేక అల్లాడుతన్న కార్మికులను యాజమాన్యాల ఒత్తిడి చేయడంతో అనారోగ్య సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని.ఈపరిస్తితుల్లో యాజమాన్యాలు కార్మికులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడం బాధాకరమని అన్నారు. వెంటనే దేశాయ్ బీడీ పరిశ్రమ యాజమాన్యం పైన తగు చర్యలు తీసుకోని ఈ పిటార తినుబడారాల ప్యాకెట్లు అమ్మకాన్ని వెంటనే నిలుపుదల చేసి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు లలిత, పద్మ, వెంకటలక్ష్మీ, నాగలక్ష్మి, కే.పద్మ, రాధ, విజయ, శారద, మంజుల,శ్యామల, లక్ష్మి, లత, తదితరులు పాల్గొన్నారు.
Spread the love