విరాట్ కోహ్లీ ఆర్సీబీని వీడాలి: పీటరన్స్

నవతెలంగాణ – హైదరాబాద్ : నిన్న జరిగిన ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో ఆర్సీబీ ఓటమిపై స్పందిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటరన్స్.. కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీకి అర్హుడని, అతడు ఆర్సీబీని వీడాలని కోరారు. ‘గతంలో చెప్పా, మళ్లీ చెబుతున్నా.. గొప్ప ఆటగాళ్లు జట్లను వీడి కీర్తి గడించారు. కోహ్లీ ఈసారీ ఆరెంజ్ క్యాప్ సాధించారు. అయినా జట్టు ఫెయిలైంది. అతడు హోమ్ టీమ్ ఢిల్లీలో చేరాలి’ అని కెవిన్ పీటరన్స్ అన్నారు. ఈ సీజన్‌లో కోహ్లీ 741రన్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

Spread the love