పంచాయతీ కార్మికుల రెండో దశ సమ్మెకు వినతి

నవతెలంగాణ-ఝరాసంగం
గత జులై నెలలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు 34 రోజుల సమ్మె చేపట్టిన విషయం విధితమే. ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర గ్రామీణ అభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ నాయకులతో కలిసి ఎంపీడీవో సుజాతకు మెమోరాండం అందజేశారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించకుండా కేవలం చావు ఖర్చు లకు, ఇన్సూరెన్స్‌కి మాత్రమే సర్కులర్‌ జారీ చేసి మోసం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది పర్మనెంట్‌, వేతనాల పెంపు, మల్టీపర్పస్‌ విధానం రద్దు, కారోబార్‌, బిల్‌ కలెక్టర్లు, గుమస్తాలకు స్పెషల్‌ స్టేటస్‌ కల్పిస్తూ సహాయ కార్యద ర్శులుగా నియమించాలని, పంచాయతీ కార్యద ర్శులను సైతం పిఆర్సి పరిధిలోకి తీసుకురా వాలని ప్రధాన డిమాం డ్లతో దశల వారి పోరాటం చేయాలని, ప్రభుత్వం స్పందిం చకపోతే సమ్మెకు కూడా వెళ్లాలని వినతిలో పేర్కొ న్నారు. అనంతరం అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలి పారు. మెమోరండం అందించిన వారిలో సీఐటీయూ నాయ కులు మహిపాల్‌, చంద్రన్న, సంగమేష్‌ పాల్గొన్నారు.
కొండాపూర్‌: మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ.. ఇటీవలే పంచాయతీ ఉద్యోగ కార్మికులు 34 రోజులు పాటు సమ్మె చపట్టగా.. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందిస్తూ.. సమస్యను పరిష్కరిస్తాం సమ్మె విరమించండి అని జేఏసీ నాయకత్వాన్ని రెండుసార్లు చర్చలకు పిలిచారన్నారు. కానీ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రంలోని 50 వేల మంది పంచ ాయతీ కార్మికులను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింద న్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతూ రాష్ట్రంలో రెండో సారి సమ్మెలోకి వెళ్లడానికి జేఏసీ నిర్ణయించిందన్నారు. 20వ తేదీన అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీవోలకు వినతిపత్రం అందించాలని.. 22 నుంచి 24 వరకు సమ్మె నోటీసులు ఇవ్వాలని, 21న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదు ట నిర్వహించాలని నిర్ణయించారన్నారు. అలాగే అక్టోబర్‌ 1న చేపట్టనున్న ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేసి.. అక్టోబర్‌ 2నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణj ుం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో యూనియన్‌ నాj ుకులు సంజివులు, వెంకయ్య, రాజు, విజెండర్‌, మోహన్‌, ప్రభాకర్‌, లక్యా, కవిత, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Spread the love