నవతెలంగాణ – హైదరాబాద్: సచివాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విగ్రహ ప్రతిష్ఠ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జూలూరు గౌరీశంకర్ పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.